శ్రీదేవిని చంపేశారు.. కాళహస్తి ఆలయ సిద్ధాంతి - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవిని చంపేశారు.. కాళహస్తి ఆలయ సిద్ధాంతి

March 19, 2018

ప్రముఖ నటి శ్రీదేవిది సహజ మరణం కాదని, హత్య అని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆస్థాన సిద్దాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ చెప్పారు. ఆమెను సన్నిహితులే చంపారని పేర్కొన్నారు. ఆదివారం ఉగాది పర్యదినం సందర్బంగా శ్రీకాళహస్తి ఆలయ ప్రాగణంలో ఆయన పంచాగం చదివారు.‘ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగితే మళ్లీ మోదీని ప్రధాన మంత్రి అవుతారు. అయితే  గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, బిహార్‌లో బీజేపీకి సీట్లు కనీసం సగానికి తగ్గుతాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటు కూడా దక్కదు. తెలంగాణలో 2019లో టీఆర్ఎస్ మళ్లీ విజయం సాధిస్తుంది. కేసీఆర్ మూడో ఫ్రంట్‌ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రజనీకాంత్‌ రాజకీయాల్లో రాణిస్తాడు’ అంటూ రాజకీయాల గురించి రామలింగేశ్వర వరప్రసాద్‌ వివరించారు.