నవంబర్ 14న చిల్డ్రన్స్ డే కాదు అంకుల్స్ డే - MicTv.in - Telugu News
mictv telugu

నవంబర్ 14న చిల్డ్రన్స్ డే కాదు అంకుల్స్ డే

April 6, 2018

నవంబర్ 14ను చిల్డ్రన్స్ డేగా కాకుండా అంకుల్స్ డేగా జరుపుకోవాలని..  డిసెంబర్ 26న చిల్డ్రన్స్ డేగా జరుపుకోవాలని కోరుతూ వందమంది బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. చాలా ఏళ్లుగా నవంబర్ 14ను చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆ రోజు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నంగా నెహ్రూ జయంతి రోజును చిల్డ్రన్స్ డేగా జరుపుతున్నారు. అయితే ‘నెహ్రూకు పిల్లల పట్ల ఉన్న ప్రేమకు చిహ్నంగా నవంబర్ 14ను చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం తప్ప పిల్లల సంక్షేమంపై అసలైన అవగాహనను మాత్రం కల్పించలేకపోతున్నాం..’ అని బీజేపీ  ఎంపీలు అన్నారు.అయితే  డిసెంబర్ 26నే ఎందుకు ప్రతిపాదించారని మీడియా అడిగిన ప్రశ్నకు వారు స్పందించారు.  డిసెంబర్ 26న గురుగోవింద్ సింగ్ పిల్లలైన షాహిజాదా అజిత్ సింగ్ (18), జుఝార్ సింగ్ (14), జోరావర్ సింగ్(9), ఫతే సింగ్ (7) మొగల్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు విడిచారు. వాళ్ల త్యాగాలకు గుర్తుగా డిసెంబర్ 26న చిల్డ్రన్స్ డేగా జరుపుకోవాలి. అలా చేస్తే పిల్లలకు తమ శక్తిపై తమకు నమ్మకం కలుగుతుంది.  వాళ్ల హక్కుల కోసం పోరాడే తత్వం అలవడుతుంది’ అని వివరించారు. నవంబర్ 14న అంకుల్స్ డే లేదా చాచా దివస్‌గా జరుపుకోవాలని వాళ్లు ఆ లేఖలో ప్రధానిని కోరారు.