బాలయ్య భుజానికి సర్జరీ హిట్.. - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య భుజానికి సర్జరీ హిట్..

February 3, 2018

సినీ నటుడు బాలకృష్ణకు ఎట్టకేలకు సర్జరీ జరిగింది. ఆయన కుడి భుజానికి శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ ఆస్పత్రిలో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగింది. 8 నెలల నుండీ నొప్పిని భరిస్తూ బాలయ్య సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. నొప్పి ఎక్కువ అవటంతో సర్జరీ తప్పనిసరి అని డాక్టర్లు సూచించటంతో బాలయ్య సర్జరీ చేయించుకోక తప్పలేదు. కాంటినెంటల్ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు జరిపిన అనంతరం క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ ( పూణే ) స‌ర్జ‌రీ చేశారు. దాదాపు గంట‌సేపు జ‌రిగిన ఈ స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంద‌ని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్న బాలకృష్ణ షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి సర్జరీ చేయించుకున్నారు.‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడ్డారు. అప్పటి నుంచే ఆయ‌న రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ ప‌డుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం ప్రాథ‌మిక చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆయ‌న ‘పైసా వసూల్ ’ ‘ జైసింహా ’ చిత్రాల షూటింగ్‌ల సంద‌ర్భంగా బిజీబిజీగా ఉండటంతో స‌ర్జ‌రీ చేయించుకోలేక‌పోయారు. దాదాపు నెల రోజుల విశ్రాంతి తరువాత తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.