mictv telugu

ప్రారంభమైన కుంభమేళా.. పుణ్యస్నానం ఆచరించిన స్మ్రితి ఇరానీ

January 15, 2019

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుంభమేళా ఈరోజు ఉదయం ప్రయాగరాజ్‌లో(అలహాబాద్) ప్రారంభమైంది. ఈరోజు నుంచి మార్చి 4వ తేదీ వరకు 45 రోజులపాటు ఈ కుంభమేళా కొనసాగనుంది. కాగా, ఇవాళ ఉదయం ప్రయాగరాజ్‌లో పుణ్యస్నానం ఆచరించారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ఈ సందర్భంగా తీసిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Telugu News Union Minister Smriti Irani Takes a Holy Dip at Kumbh Mela 2019 .

ఇక కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు… తొలిరోజే కోటి మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్ ఏర్పాట్లు చేసింది. 45 రోజుల  పాటు జరిగే ఈ కుంభమేళకు 192 దేశాల నుంచి కోట్లాది మంది భక్తులు విచ్చేయనున్నారు.

Telugu News Union Minister Smriti Irani Takes a Holy Dip at Kumbh Mela 2019