శివబాలాజీ భార్యను వేధిస్తున్నవాడు దొరికాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

శివబాలాజీ భార్యను వేధిస్తున్నవాడు దొరికాడు..!

October 30, 2017

నటుడు శివబాలాజీ భార్యకు అసభ్య మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 శివబాలాజీ భార్య మధుమిత ఫేస్‌బుక్‌ ఖాతాకు, ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ల ద్వారా అవి ఎక్కడి నుంచి వచ్చాయి అని ఐపీ అడ్రస్‌లను జల్లెడ పట్టి అనుమానితుణ్ని గుర్తించారు. అతడు సినిమారంగానికి చెందిన వ్యక్తేనని తెలుస్తోంది. తనపై కోపంతో తన భార్యను వేధిస్తున్నారని బాలాజీ ఇదివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘నన్నేమీ చేయలేక తన భార్యను టార్గెట్ చేస్తున్నారు. మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలను నేను  పలుమార్లు గట్టిగా ఖండించాను. అందుకే నాపై కక్షగట్టారు’ అని తెలిపాడు. దీంతో వేధింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మధుమిత గతంలో చాలా సినిమాల్లో నటించింది. శివబాలాజీ ఈ మధ్యే తెలుగు బిగ్‌బాస్‌ టైటిల్‌ని కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.