హెల్మెట్ పెట్టుకోకపోతే.. చెమటలు పోసేలా శిక్ష! - MicTv.in - Telugu News
mictv telugu

హెల్మెట్ పెట్టుకోకపోతే.. చెమటలు పోసేలా శిక్ష!

February 22, 2018

హెల్మెట్ ధరించకుండానే ద్విచక్ర వాహనం నడుపడం నేరమని తెలిసిన కూడా కొంతమంది  అలానే చేస్తారు. పోలీసుల తనిఖీల్లో హెల్మెట్ లేకుండా పట్టుపడితే జరిమానా రూ. 100 నుంచి 200 వరకు పడుతుంది. అదేం పెద్ద మొత్తం కాదని కొందరి నిర్లక్యం. దీంతో ఇక ఫలితం లేదని భావించిన ఆగ్రా పోలీసులు హెల్మెట్ పెట్టుకోవడానికి ససేమిరా అంటున్న వాహనాదారులకు వింత శిక్షను విధిస్తున్నారు.

హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారిని అర కిలోమీటరు దూరం బైకును తోస్తు నడవాలని  ఆదేశిస్తున్నారు. 500 మీటర్ల దూరాన్ని బైక్‌ను నెట్టుకుంటూ వెళ్లడం వల్ల వారికి వ్యాయామంతో పాటు ఆ ఘటన బాగా గుర్తుండిపోతుందని, ఇకపై హెల్మెట్ ధరించాలన్న ఆలోచన కలుగుతుందని ఆగ్రా పోలీసులు అంటున్నారు. అదే సమయంలో హెల్మెట్ ధరించి  వస్తేనే బండిలో పెట్రోలు పోయాలని కూడా వారు బంకుల యాజమాన్యాలను ఆదేశించారు.

ఈ వాకింగ్ శిక్ష వాహనదారుల్లో ఎంతవరకూ చైతన్యాన్ని తెస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే, గత సంవత్సరం ఒక్క ఆగ్రాలోనే 1,062 ద్విచక్ర వాహన ప్రమాదాలు నమోదయ్యాయి. దీంతో హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్న ఉద్దేశంతో పోలీసులు ఈ కొత్త ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు.