చిన్నారి నరబలికి..మేడారంలో బీజం! - MicTv.in - Telugu News
mictv telugu

చిన్నారి నరబలికి..మేడారంలో బీజం!

February 15, 2018

హైదరాబాద్ ఉప్పల్ లోని చిలుకానగర్లో జరిగిన  చిన్నారి నరబలి ఘటన  గత కొన్ని రోజులుగా  అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును పూర్తిగా చేధించారు. ఈ నరబలికి రెండేళ్ల క్రితమే మేడారంలో బీజం పడింది.  నిందితుడు రాజశేఖర్ తన భార్య శ్రీలతతో కలిసి మేడారం జాతరకు వెళ్లాడు.  ఈక్రమంలో తన భార్య ఆరోగ్యం సరిగా ఉండడటం లేదని ఏదైనా పరిష్కారం చెప్పమని అక్కడున్న ఓ కోయదొరను కలిశారు. దీనితో ఆ కోయదొర మీ ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, మీ ఆరోగ్య పరిస్థితి బాగుపడాలన్నా..చిన్నపిల్లను నరబలి ఇవ్వడమే పరిష్కారం అని చెప్పాడు.అయితే రెండేళ్లుగా ఆ దంపతులు నరబలి కోసం చిన్నపిల్లలు ఎక్కడ దొరుకుతారని అన్పేషిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో  రాజశేఖర్ తమ్ముడు గణేశ్  బోయిగూడలో ఫుట్ పాత్ పై పడుకున్న రెండేళ్ల  చిన్నారిని ఎత్తుకొచ్చాడు. చంద్రగ్రహణం రోజు దంపతులిద్దరూ ఓ మంత్రగాడి ఆద్వర్యంలో  నగ్నంగా పూజలు చేసి చిన్నారిని బలిఇచ్చారు. ఆతర్వాత  చిన్నారి తలపై చంద్ర కిరణాలు, సూర్యకిరణాలు పడాలని మంత్రగాడు చెప్పడంతో తలను డాబాపై పడేశారు.  ఈకేసులో పోలీసులు మొదట ఎదురింట్లో ఉన్న ఇద్దరిని  అనుమానంతో అరెస్ట్ చేశారు.  కానీ విచారణలో అసలు నిందితుడు ఇంటి ఓనర్ రాజశేఖరే  అని తెలియడంతో ఈ నరబలిలో పాలుపంచుకున్న వారందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై సెక్షన్124,302,366,201,120B కింద్ర కేసులు నమోదు చేశారు. మూడ నమ్మకాలతో  ముక్కు పచ్చలారని  పసి పాపను పొట్టను పెట్టుకున్న  వీరిని కఠినంగా శిక్షించాలని పలువురు మండిపడుతున్నారు.