అగ్రకులాల రిజర్వేషన్లకు అర్హతలు ఇవే

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం సంచలనంతోపాటు ఆసక్తి కూడా రేకెత్తిస్తోంది. ఈ కోటాను ఎలా అమలు చేస్తారు? విధివిధానాలు ఎలా ఉంటాయి? సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు భిన్నంగా ఉన్న కోటాకు చట్టబద్ధత ఎలా కల్పిస్తారన్నదానిపై చర్చ సాగుతోంది.

ret

కేంద్ర ప్రభుత్వ వర్గాలు, ప్రస్తుత కోటా నియమ నిబంధనల ప్రకారం.. అగ్రవర్ణాలకు కుల ప్రాతిపదికనే అయినా ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకునే కోటాను అమలు చేస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లోనూ కోటా ఉంటుంది. కోటా పొందాలంటే ..

కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి

కుటుంబానికి వ్యవసాయ భూమి 5 ఎకరాల్లోపే ఉండాలి

నివాస గృహం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించకూడదు

రెసిడెన్షియన్ ప్లాట్.. నోటిఫైడ్ మునిసిపల్ ఏరియాలో అయితే వంద గజాలకు మించకూడదు. నాన్  మునిసిపల్ ప్రాంతంలో 200 గజాలకు మించకూడదు.

బ్రాహ్మణు, ఠాకూర్లు, రెడ్లు, కమ్మ, వైశ్యుల తదితర కులాలతోపాటు, సిక్కుల్లోని అగ్రకులాల పేదలకు కూడా కోటా అందుతుంది.