విద్యాబుద్దులు నేర్పాల్సిన పంతులే బుద్దిలేని పని చేశాడు. తెలిసీ తెలియని తనంతో పిల్లాడు జ్యూస్‌లో మూత్రం పోస్తే..అది తప్పు అని సామరస్యంగా చెప్పేది పోయి, ఆ పిల్లాడి చేతే ఆ మూత్రం కలిసిన పళ్లరసాన్నే తాగించాడు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఎన్పీఆర్ విద్యా కాన్సెప్ట్ స్కూల్లో ఈ అమానవీయ ఘటన జరిగింది.
ఒకటో తరగతి చదువుతున్న ఓబాలుడు తోటి విద్యార్ధిని తెచ్చుకున్న జ్యూస్‌లో మూత్రం పోశాడు. అది గమనించిన విద్యార్ధిని ఆ విషయం టీచర్ శ్యాంసన్‌కు చెప్పింది. దీనితో ఆగ్రహానికి గురైన టీచర్ వెంటనే మూత్రం కలిసిన జ్యూస్‌ని ఆ బాలుడితోనే బలవంతంగా తాగించాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన బాలుడు ఈవిషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు.
దీనితో ఆ టీచర్‌పై పోలీసులుకు విద్యార్ధి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ టీచర్‌ను అరెస్ట్ చేశారు. పిల్లలు తెలిసీ తెలయని తనంతో అల్లరి చేస్తారు. ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సిన టీచర్లే ఇలా విచక్షణ కోల్పోయి ఇలాంటి పనులు చెయ్యడం ఏందని తోటి ఉపాధ్యాయులు ఆ టీచర్‌పై మండిపడుతున్నారు.