ద్రౌపదిలా నటిస్తావా.. చంపిపారేస్తాం.. ! - MicTv.in - Telugu News
mictv telugu

ద్రౌపదిలా నటిస్తావా.. చంపిపారేస్తాం.. !

March 5, 2018

‘పద్మావత్’ చిత్రంలో రాజపుత్రులను కించపరచే సన్నివేశాలు చిత్రీకరించరంటూ  కథానాయిక దీపికా పదుకునె ముక్కు కోసేస్తామని కర్ణిసేన హెచ్చరించిన సంగతి తెలిసిందే . అలాంటి పరిస్థితినే  మరో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఎదుర్కొంటోంది. గుర్తుతెలియని వ్వక్తులు  ఆమెను చంపుతామని బెదిరిస్తున్నారు.  విశాల్ పాండ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హేట్ స్టోరీ4’లో ఊర్వశి నటించింది. ఈ  చిత్రం మార్చి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఊర్వశి, తన సహచర నటుడు సూరజ్ పంచోలితో శృంగార సన్నీవేశాల్లో  రెచ్చిపోయి మరీ నటించింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఊర్వశి  మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర ద్రౌపది పాత్రను పోలి ఉంటుందని చెప్పింది.

దీంతో కొందరు ఆమె భగ్గుమంటున్నారు. సిగ్గులేకుండా శృంగార సన్నివేశాల్లో నటించి ద్రౌపదితో పోల్చుకోవడం ఏమిటి? అని బెదిరింపులకు పాల్పడ్డారు. తనను చంపిపారేస్తామని హెచ్చరిస్తున్నారని,  మెయిల్స్, ఫోన్లలో అసభ్యంగా దూషిస్తున్నారని ఊర్వశి ఆందోళనకు గురవుతోంది.