మతప్రచారానికి వెళ్లి... బాణాలకు బలై.. - MicTv.in - Telugu News
mictv telugu

మతప్రచారానికి వెళ్లి… బాణాలకు బలై..

November 21, 2018

అండమాన్ నికోబర్ దీవుల్లో ఘోరం జరిగింది. మత ప్రచారం చేస్తున్నాడన్న అక్కసుతో గిరిజనులు ఒక అమెరికన్ పర్యాటకుడికి హతమార్చారు. 27 ఏళ్ళ జాన్ అల్లెన్ చౌన్ క్రైస్తవ మతస్తుడు. పర్యటన కోసం ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడి ప్రజల్లో క్రైస్తవ మత ప్రచారం చేస్తుండేవాడు. దీని కోసం అండమాన్ దీవులకు అనేక పర్యాయాలు వచ్చాడు.

Telugu News US tourist John Allen Chaun killed by tribes in andaman nicobar islands.

50 మంది జనాభా మాత్రమే ఉన్న గిరిజన తెగ నివసిస్తున్న ఉత్తర సెంటినెల్ దీవుల్లోకి వెళ్లి అక్కడి ప్రజలకు క్రైస్తవ మత బోధన చేయాలని ఆశించాడు చౌన్. కొందరు జాలర్ల సహాయంతో ఈనెల 14న అక్కడికి చేరుకున్నాడు. మొదటిసారి అక్కడికి చేరుకోవడం సాధ్యం కాకపోవడంతో మరుసటి రోజు నవంబర్ 16న అక్కడికి చేరుకునే ప్రయత్నం చేసాడు. ఈ విషయం పసిగట్టిన గిరిజనులు అతని రాకను ప్రతిఘటించి బాణాలతో హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని 7 గురు అనుమానితులైన జాలర్లను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

Telugu News US tourist John Allen Chaun killed by tribes in andaman nicobar islands