తెలుగుపిల్ల అందానికి కిరీటం - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగుపిల్ల అందానికి కిరీటం

October 27, 2017

భారత సంతతికి చెందిన తెలుగు యువతి  హిమాన్వి పనిదెపు మిస్ వర్జీనియా టీన్ యూఎస్ఏ 2018 కీరిటాన్ని గెలుచుకుంది. దీన్ని అందుకున్న తొలి భారతీయ  అమెరికన్‌గా హిమాన్వి నిలిచింది. 17 ఏళ్ల హిమాన్వి క్లిఫ్టన్‌లోని సెంట్రెవిల్లె హైస్కూల్‌లో చదువుకుంటోంది.

 39 మంది యువతులతో పొటీపడి ఈ అందాల కిరీటాన్ని దక్కించుకుంది.  డౌన్ టౌన్ నార్ఫోక్‌లోని టైడ్ వాటర్ కమ్యూనిటీ కాలేజీలో  రోపర్ థియేటర్‌లో మిస్ వర్జీనియా టీన్  యూఎస్ఏ 2018 టైటిల్‌కు హిమాన్వికి  బహుకరించారు. ‘నేను మానసిక ఆరోగ్యం, డ్రగ్స్ ,మధ్యపానం పై ప్రజల్లో అవగహన కల్పించేందుకు నా వంతుగా  వర్జీనియాలో కృషి చేస్తాను’ అని హిమాన్వి చెప్పింది.  ‘నాకల నెరవేరింది. ఈ కిరీటం సాంధించడంలో తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు’ అని హిమాన్వి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది.