కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా.. కానీ చేంజ్.. - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా.. కానీ చేంజ్..

February 1, 2018

నిన్న జోగులాంబ గద్వాల్ జిల్లా పర్యటనలో మంత్రి  కేటీఆర్‌ మాట్లాడుతూ..  ‘2019లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే నువ్వు తీసుకుంటావా?’ అని  అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీన్ని స్వీకరిస్తున్నట్లు ఉత్తమ్ గురువారం చెప్పారు. అయితే సవాల్ లో చిన్న మార్పు చేయాలన్నారు.  కేటీఆర్ సవాలును స్వీకరిస్తున్నా, కాంగ్రెస్ ఓడిపోతే నేను మా కుటుంబం రాజకీయాల నుండి తపుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేటీఆర్, కవిత, కేసీఆర్, హరీష్ రావు రాజకీయాల నుంచి తపుకుంటారా?  టీఆర్ఎస్ వంద సీట్లు గెల్వకపోతే  కేసీఆర్ రాజకీయాల నుంచి తపుకుంటారా? మళ్లీ చెబుతున్నా కాంగ్రెస్‌కు 2019 ఎన్నికల్లో 70 సీట్లు వస్తాయి’ అని చెప్పారు.

రాహుల్ గురించి విమర్శించే హక్కు కేటీఆర్‌కు లేదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. ‘కేటీఆర్ విలాసవంతమైన జీవితం కోసం తెలంగాణ సాధించలేదు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల జులుం, మీడియా రాజ్యం నడుస్తోంది. కోదండరాం, గద్దర్ అంటే పాలకులకు  గౌరవంలేదు. దళితులకు బేడీలు వేస్తున్నారు. అధికార అహంతో నెత్తికి ఎక్కి అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేస్తోంది  టీఆర్ఎస్. మిషన్ భగీరథ, కాకతీయలతో అవినీతితో డబ్బులు దండుకుంటున్నారు. కేసీఆర్ పౌర హక్కులను కాలరాస్తున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ హత్యలు చేయిస్తోంది.  ఖమ్మంలో వేముల శ్రీనివాస్‌ను చంపిన నిందితుడు, హోమ్ మంత్రితో కల్సి తిరుగుతూ ఫోటోలు తీసుకుంటున్నారు. కేటీఆర్ ఓ బచ్చా..నా సవాల్ కేసీఆర్‌కే  ఇస్తున్నా…2019లో ఓడిపోతే  నాకుటుంబం రాజకీయం నుంచి పూర్తిగా తప్పుకుంటుంది. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ కుటుంబం కూడా తప్పుకోవాలి’ అని సవాల్ విసిరారు..