రాహుల్ నియోజక వర్గంలో బీజేపీ గెలుపు.... - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ నియోజక వర్గంలో బీజేపీ గెలుపు….

December 1, 2017

ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి  ఘోర అవమానం జరిగింది. తాజాగా  జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వంత నియోజకవర్గం ఆమేథీలో  హస్తం కాస్తా బోల్తా కొట్టి కమలం విరబూసింది.  

ఆమేథీ నగర పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆమేథీలో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ సీనియర్ నేతలంతా ఒక్కసారిగా  షాక్‌కు గురయ్యారు. ఈ సందర్భంగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భారీ ప్రసంగాలు ఇస్తున్న రాహుల్ .. తన సొంత నియోజక వర్గంలో గెలువలేకపోయాడని  సీఎం యోగి విమర్శించారు. ఆమేథీ నుంచి బీజేపీ  అభ్యర్థి  చంద్రమా దేవి మేయర్‌గా గెలుపొందింది.