జీన్స్ వేసుకునే అమ్మాయిలకు పెళ్లికాదు: కేంద్ర మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

జీన్స్ వేసుకునే అమ్మాయిలకు పెళ్లికాదు: కేంద్ర మంత్రి

December 11, 2017

బీజేపీ నేతలు సంస్కృతి వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. జీన్స్ ధరించే అమ్మాయిలు మంచివాళ్లు కాదని, వారికి పెళ్ళిళ్లు కావని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ చెప్పకొచ్చారు.‘పెళ్లి మండపానికి జీన్స్ వేసుకుని వచ్చే అమ్మాయిలను ఏ అబ్బాయీ పెళ్లి చేసుకోవాడానికి ఇష్టపడడు… అలాగే కాషాయ బట్టలు వదిలేసి జీన్స్ వేసుకునే ఆధ్యాత్మిక గురువులకు కూడా గౌరవం ఉండదు..’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో‌ని గోరఖ్‌పూర్‌లో ఉన్న మహారాణా ప్రతాప్  శిక్షా పరిషద్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.  ఆ  కార్యక్రమంలో  ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఉండడం గమనార్హం. భారతీయ సంప్రదాయంలో సందర్బానికి తగినట్లు దుస్తులు వేసుకోవాలని  చెబుతూ సత్యపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.. మహారాణా ప్రతాప్  పరిషద్ సంస్థ విద్య, ఆరోగ్య రంగంలో చేస్తున్నసేవలతో పాటు హిందూ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టడంతో కీలక పాత్ర పోషిస్తోందని సత్యపాల్  అన్నాడు.