బాలికపై రేప్.. సాక్ష్యాల్లేవని కేంద్ర మాజీ మంత్రికి ఊరట - MicTv.in - Telugu News
mictv telugu

బాలికపై రేప్.. సాక్ష్యాల్లేవని కేంద్ర మాజీ మంత్రికి ఊరట

April 10, 2018

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ కేంద్రమంత్రి స్వామి చిన్మయానందపై నమోదైన రేప్ కేసును ఎత్తివేసింది. రేప్ కేసుకు సాక్షులు లేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది.చిన్మయానందకు హరిద్వార్‌లో ఒక ఆశ్రమం ఉంది. అందులో ఆయన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని 2011 నవంబర్‌లో ఓ బాలిక షాజహాన్ పూర్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రేప్ సంగతిని బయటపెడితే చంపేస్తానని స్వామి బెదిరించారని పేర్కొంది. దీంతో చిన్మయానంద హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి తప్పించకున్నాడు. అప్పటి నుంచి పెండింగ్ ఓ ఉన్న ఈ కేసుపై యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించి, స్వామికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

స్వామి అఘాయిత్యం చేస్తుండగా చూసిన సాక్షులు లేరు కనుక  సీఆర్ఫీసీ సెక్షన్ 321 ప్రకారం విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వాధికారులు లేఖ రాసారు.  చిన్మయానంద 1991,1998,1999 సంవత్సరాల్లో షాజహన్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అటల్ బిహరీ వాజపేయి సర్కార్‌లో హోం శాఖ సహాయమంత్రిగా పని చేశారు.