కాలు తగిలిందని.. దారుణ హత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

కాలు తగిలిందని.. దారుణ హత్య..

February 12, 2018

కాలు తగిలిందంటూ  మెదలైన గొడవ చివరికి ఒకరి ప్రాణాలను తీసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లోని కాలికా రెస్టారెంట్‌లో శనివారం జరిగింది. లా చదువుతున్న దిలీప్ అనే విద్యార్థి తన స్నేహితులతో డిన్నర్ చేయడానికి కాలిక రెస్టారెంట్‌కు వెళ్లాడు. విజయ్ శంకర్ అనే వ్యక్తికి అనుకోకుండా దిలీప్ కాలు తగిలింది.  దాంతో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది.

డిన్నర్ తర్వాత మరోసారి గొడవ  జరగడంతో రెస్టారెంట్ బయట ఇద్దరూ కొట్టుకున్నారు. అదే సమయంలో రెస్టారెంట్ వెయిర్‌టర్ మున్నా చైహన్ ఐరన్ రాడ్‌తో దిలీప్ తలపై గట్టిగా కొట్టాడు. దాంతో దిలీప్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.

ఈ ఘటనంతా బయట ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ విషయాన్ని కాలిక  రెస్టారెంట్‌ యజమాని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే పోలీసులు సమయానికి అక్కడికి రాలేదు. తర్వాత తీరిగ్గా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విజయ్‌ శంకర్‌, మున్నాచౌహన్‌లను అదుపులోకి తీసు0కున్నారు. సమయానికి అప్రమత్తం కానీ ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. గొడవ దిలీప్‌-విజయ్‌ శంకర్‌ మధ్య జరిగ్గా..  వెయిటర్‌ ఎందుకొచ్చాడనేది పోలీసులకు అంతు చిక్కడంలేదు. వెయిటర్‌ను విచారించగా కూరగాయలు తీసుకొస్తున్న తనను దిలీప్‌ కొట్టడంతో ఆగ్రహానికి లోనై రాడ్‌తో దాడిచేసానని అతను తెలిపాడు