అగ్గిపెట్టె తిరిగివ్వలేదని వార్నింగ్ నోటీస్! - MicTv.in - Telugu News
mictv telugu

అగ్గిపెట్టె తిరిగివ్వలేదని వార్నింగ్ నోటీస్!

February 6, 2018

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ ఎలక్ట్రిసిటి ఇంజనీర్ సుశీల్ కుమార్  రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తమ ఆఫీస్‌లో దోమల రిఫిలెంట్ కాయిల్స్ కాల్చేందుకు అగ్గిపెట్టె తీసుకుని ఇంకా తిరిగి ఇవ్వలేదని, అది వెంటనే తిరగి ఇవ్వకపోతే  తగిన చర్యలు తీసుకుంటామని  అందులో హెచ్చరించాడు.

 ‘గత నెల 23న అతనికి నేను అగ్గిపెట్టె ఇచ్చాను. అందులో 19 పుల్లలు ఉన్నాయి.  దాన్ని తీసుకుని వారం రోజులు అవుతున్నా ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదు.. ఆఫీసులో అగ్గిపెట్టె లేకపోవడంతో  సాయంత్రం వేళలో దీపాలు ముట్టించుకోవడానికి  ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.ఈ లేఖ  అందిన మూడు రోజుల్లో తిరిగి అగ్గిపెట్టె ఇవ్వాలి..’ అని సదరు లేఖలో ఉంది. ఈ లేఖపైన కార్యాలయ అధికారిక స్లాంప్ వేసి మరీ  పంపాడు.

ఇది వాట్సాప్‌లో వైరల్ అవ్వడంతో  సుశీల్ కుమార్ మాట్లాడుతూ.. జాబ్‌లో కొత్తగా చేరిన కంప్యూటర్ ఆపరేటర్‌కు లెటర్ పార్మాట్ తెలియడం కోసమే  అలా లేఖ రాశానని చెప్పాడు. సుశీల్ చెప్పింది నిజమేని సదరు కంప్యూటర్ ఆపరేటర్ కూడా అంటున్నాడు. హిందీలో ఉన్న ఈ లేఖను ఓ పోలీసు అధికారి తన అధికార ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. రూ.1 పెడితే వచ్చే అగ్గిపెట్ట కోసం ఇంజనీరు చేసిన హెచ్చరిక చాలా హస్యాస్పదంగా ఉందని నెటిజన్లు అంటున్నారు.