సీఎం ఇంటి ముందే చస్తా.. ఓ రైతు ఆత్మఘోష - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం ఇంటి ముందే చస్తా.. ఓ రైతు ఆత్మఘోష

February 16, 2018

ఉత్తర‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఓ రైతు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.  ఈ రోజు యూపి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది చొరవతో రైతు శాంతిచ్చాడు.

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ చెందిన రామ్‌రాజ్  ఈ రోజు పొద్దున తన కుమాడితో కలిసి ముఖ్యమంత్రి అధికార నవాసం కాళిదాస్ మార్గ్‌కు వచ్చాడు.సీఎం నివాసం వద్ద ఉన్న 100 అడుగుల ఎత్తైన చెట్టును ఎక్కి ఉరివేసుకునేందుకు ఒరికట్టాడు. వెంటనే పోలీసులు ,అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని  రామ్‌ను కిందకు దించేందుకు ప్రయత్నించారు.

అతను తనకున్న రుణం రూ. 1.9లక్షలను మాఫీ చేస్తానని హామి ఇస్తానే చెట్టు దిగాతాని తేల్చి చెప్పాడు. దాంతో దాదాపు గంటకు పైగానే హైడ్రామా కొనసాగింది. ఎట్టకేలకు అధికారులు రుణమాఫీపై హామీ ఇవ్వడంతో రైతు చెట్టు దిగాడు. ఆనతంరం అతడిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ  హామి ఇచ్చింది.  ప్రభుత్వం  గత ఏడాదీ రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే