mictv telugu

హిందువును పెళ్లాడుతున్నాడని ముస్లింపై దాడి

July 24, 2018

మతాంతర వివాహం చేసుకుంటున్న ఓ ముస్లిం యువకుడిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అంతేకాకుండా ఈడ్చుకెళ్లి రోడ్డుపై ఊరేగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

Attack on a Muslim  in the Registrar's office

మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడు( ముస్లిం) ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతి(హిందూ) నోయిడాలోని ఒకే కంపెనీలో పని చేస్తున్నారు.  ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ వివాహ బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు. ఘజియాబాద్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు న్యాయవాదితో చర్చిస్తుండగా  లాయర్ చాంబర్‌లోకి వచ్చిన కొందరుయువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని ప్రేమ జంటతో పాటు దాడికి పాల్పడిన వారిలో ఇద్దరిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.ప్రేమజంట తాము  మేజర్లమని,పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడంతో పాటు ఆధారాలు చూపించడంతో వారిని వదిలిపెట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్‌ ఎస్పీ తెలిపారు. అయితే, దాడి చేసిన వ్యక్తులపై కేసు పెట్టేందుకు ప్రేమ జంట నిరాకరించింది.