పెళ్లి కావడం లేదని ఇనుము తిన్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కావడం లేదని ఇనుము తిన్నాడు..

April 9, 2018

టెక్నాలజీ ఎంతగా పెరుగుతోందో మూఢనమ్మకాలు అంత బలంగా పాతుకుపోతున్నట్లు అర్థమవుతోంది ఈ ముచ్చట వింటే.  ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ ద్వివేది(42)కి వయసు పైబడుతున్నా పెళ్లి కావడం లేదు. వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక కారణంతో చెడిపోతున్నాయి. పైగా అనారోగ్యం. దీంతో సమస్య పరిష్కారం కోసం అజయ్ ఓ మాంత్రికుడిని కలిశాడు. ఆ మాంత్రికుడు మహత్తరమైన సలహా ఇచ్చాడు. తాను చెప్పినట్లు చేస్తే అనారోగ్య సమస్యలు సమసిపోయి పెళ్లి అవుతుందని చెప్పాడు.

మంత్రగాడి సలహాపై అజయ్ మొబైల్ ఫోన్లు,బ్యాటరీలు, పదునైన తీగలు, గ్లాసులతో పాటు మరికొన్ని వస్తువులను తిన్నాడు. వీటితోపాటు మరికొన్ని ఇనుప వస్తువులను క్రమక్రమంగా తినేశాడు. దీంతో రోగం నయం కాకపోగా తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. భరించలేక ఈసారి వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఎక్స్ రే తీయగా కడుపులో ఇనుప ముక్కలు కనిపించాయి. ఆ తర్వాత వైద్యులు ఆపరేషన్ వాటిని తీసేశారు.