ఉత్తరప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లో కమలం వీరబూసింది.... - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తరప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లో కమలం వీరబూసింది….

December 1, 2017

ఉత్తరప్రదేశ్  స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. నవంబర్ 22,26,29న జరిగిన  స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా, ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 652 పురపాలక స్థానాల్లో 16 మేయర్, 198 నగరపాలక పరిషత్‌లు,438 గ్రామపంచాయితీలు ఉన్నాయి. కాగా 16 మేయర్  సీట్లలో 14 స్థానాల్లో కమలం వీరబూసింది.

కీలకమైన వారణాసి, ఆయోధ్య, లక్నో, గోరఖ్‌పూర్, ఘజియాబాద్, బరేలీ, ఆగ్రా, ఫీరోజా బాద్, మథుర, కాన్పూర్, నహరాన్ పూర్, అలహాబాద్, మోరాబాద్ , ఝాన్సీలలో కమలం గెలుపొందింది. మిగతా రెండు స్థానాలు మీరట్, అలీగడ్‌లో బహుజన సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది.

ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్దికే పట్టం కట్టారన్నారు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ‘ సీఎం యోగీ ఆదిత్యనాథ్, పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు . ప్రజల అభివృద్ది కోసం మరింత కష్టపడి పనిచేసేలా ఈ విజయం మనుకు స్పూర్తినిస్తుందని ’ ప్రధాని ట్వీట్ చేశారు.