ఏ పార్టీకి ఓటేసినా.. బీజేపీకే వెళ్లాయి   - MicTv.in - Telugu News
mictv telugu

ఏ పార్టీకి ఓటేసినా.. బీజేపీకే వెళ్లాయి  

November 23, 2017

ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో లోపాలు జరిగాయి. మీరట్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో తస్లిమ్ అహ్మద్ అనే ఓటరు బీఎస్‌పీకి ఓటు  వేసేందుకు ఎంత ప్రయత్నించిన కూడా  అది కాస్తా బీజేపీకి వెళ్లినట్టు ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.   అధికారులు వెంటనే స్పందించి ఈవీఎంను మార్చారని,  మీరట్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్  ముఖేశ్  కుమార్ చెప్పారు.  ఆగ్రాలోని  గౌతమ్ నగర్‌లోని బూత్ నంబర్ 69 ఏ బటన్  నొక్కిన బీజేపీకి వెళ్తున్నట్టు  ఓటర్లు గుర్తించారు. చాలా చోట్ల ఇవే ఫిర్యాదులు రావడంతో అరగంట పాటు పోలింగ్‌ను నిలిపివేసిన అధికారులు ఈవీఎంలను సరిచేసిన అనంతరం తిరిగి పోలింగ్‌ను కొనసాగించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందని ఇతర పార్టీల నేతలు ఆరోపించారు.