మోదీజీ.. పకోడీ వ్యాపారానికి అప్పు ఇవ్వండి! - MicTv.in - Telugu News
mictv telugu

మోదీజీ.. పకోడీ వ్యాపారానికి అప్పు ఇవ్వండి!

February 14, 2018

మనం చేయబోయే వ్యాపారానికి   డబ్బులు కావాలంటే  లోన్ కోసం బ్యాంకుల చుట్టూ, లేదా అప్పుకోసం సావుకార్ల సుట్టూ తిరుగుతాం. కానీ  ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కుర్రాడు తనకు లోన్ కావాలంటూ ఏకంగా  ప్రధానమంత్రికే లేఖ రాశాడు.

ఉత్తరప్రదేశ్‌కు  చెందిన అశ్విన్  అనే  కుర్రాడు ఉద్యోగంకోసం వెతికి వెతికీ  ఉద్యోగం రాక…ఇలా అయితే లాభం లేదనుకుని అనుకుంటుండగా  ప్రధాని మోదీ ప్రసంగం టీవీలో చూశాడు. ఉద్యోగం రాలేదని యువత బాధపడకండి.  ఏదో ఒక వ్యాపారం చేసుకుంటే మీరే నలుగురికి ఉద్యొోగం ఇవ్వచ్చు అన్న ప్రధాని మాటలు అతనిలో ఉత్సాహాన్ని నింపాయి. చివరికి పకోడి వ్యాపారం  చేయాలనుకున్నాడు. లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగాడు. కానీ అతనికి  ఎక్కడికెళ్లినా నిరాశే ఎదురైందిదీనితో విసుగు చెందిన అశ్విన్ కేంద్రమంత్రి స్మృతీ ఇరానికి ఓ ఉత్తరం రాశాడు. ‘ప్రధానమంత్రి చెప్పిన పకోడి బిజినెస్ నాకు చాలా నచ్చింది. నేను పకోడి బిజెనెస్ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు లోన్ లభించడంలేదు. దయచేసి  నాకు ముద్రా రుణం ద్వారా లోన్ మంజూరయ్యేలా  నాతరపున మోదీని కోరాలని” ఆ లేఖలో రాశాడు. నా వ్యాపారానికి  తగిన లోన్ మంజూరు చేస్తే నేనే ఇంకో ముగ్గురికి ఉద్యోగం ఇస్తానని ధీమా వ్యక్తం చేశాడు. మరి సూడాలె అశ్విన్ రాసిన ఆ ఉత్తరం ప్రధాని వరకు చేరుతుందో..అతను  ఆశలు పెట్టుకున్న పకోడి బిజెనెస్‌కు  చివరకు లోన్ లభిస్తుందా? లేదా అనేది.