జీన్స్‌తో వచ్చాడని తొడలు కోశాడు... - MicTv.in - Telugu News
mictv telugu

జీన్స్‌తో వచ్చాడని తొడలు కోశాడు…

November 18, 2017

ఉపాధ్యాయులు విద్యార్థులను దారుణంగా హింసిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.  పిల్లలను  హింసిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టులు , మానవహక్కుల సంఘాలు హెచ్చరించినా యమకింకర ఉపాధ్యాయులు మాత్రం వినడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం  కాన్పూర్‌లో ఓ పాఠశాలలో దారుణ సంఘటన  జరిగింది.  ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి తొడలు కోసేశాడు.

11వ తరగతి చదువుతున్న సదరు విద్యార్థి యూనిఫాం లేకుండా జీన్స్ ధరించి  శనివారం పాఠశాలకు  వెళ్లాడు. ఇది గమనించిన స్కూల్ మేనేజర్ కోపంతో ప్యాంట్‌ను కత్తిరించాలని ఉపాధ్యాయుడికి  చెప్పాడు. దాంతో  ఉపాధ్యాయుడు విద్యార్థి ప్యాంట్‌ను తొడలపై  భాగం వరకు కత్తిరించే  సమయంలో విద్యార్థి తొడలకు తీవ్ర గాయాలయ్యాయి.

విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థి తండ్రి పాఠశాల యాజమాన్యంపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటికి పంపించి స్కూల్ యూనిఫాం వేసుకురావలని సూచించకుండా, దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డాడు.