ఇంత నీచమైన తండ్రి ప్రపంచంలో ఎక్కడైనా వుంటాడా ? - MicTv.in - Telugu News
mictv telugu

ఇంత నీచమైన తండ్రి ప్రపంచంలో ఎక్కడైనా వుంటాడా ?

April 19, 2018

తండ్రి అనే మాటకే  మచ్చ తెచ్చాడు ఓ కామాంధుడు. వావి‌ వరుసలు మార్చిపోయి కన్న కుతూరిపై అత్యాచారం చేశాడు. ఆపై తన స్నేహితులకే కన్న కూతురి  దేహాన్ని ‘కానుక’గా ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. 50ఏళ్ల వయసున్న తండ్రి తన కూతురు(35)తో ఏప్రిల్ 15న సాయంత్రం ఓ జాతరకు వెళ్లారు. ఆ తర్వాత తన మిత్రుడైన మాన్ సింగ్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు.  వారు ఇద్దరు ఆమెను ఒప్పించి ,మరో స్నేహితుడైన మిరాజ్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే తన స్నేహితులకు కన్న కూతురును ‘కానుక’గా ఇచ్చాడు ఆ నీచ తండ్రి. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తండ్రి కూడా కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత 18 గంటల పాటు ఆమెను మిరాజ్ ఇంట్లో బంధించారు.వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు, తనకు జరిగిన అన్యాయాన్ని తన  తల్లికి చెప్పి కన్నీటి పర్యంతమైంది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు మీరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రి ,మరో స్నేహితుడు మాన్‌సింగ్ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బాధితురాలికి 16 ఏళ్ల క్రితమే పెళ్లయింది.  భర్తతో విబేధాలు రావడంతో పెళ్లయిన రెండేళ్లకే పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి తన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కూతురిపైనే కన్నేసాడు ఆ కసాయి తండ్రి.. ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెని బెదిరించి, భయపెట్టి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తండ్రి  చేసిన ఆకృత్యాలను ఆమె గ్రామ పెద్దలకు చెప్పింది. దీంతో గత ఏడాది నవంబరులో అతడిని గ్రామం నుంచి బహిష్కరించారు. ఆమె తన 14 ఏళ్ల కుమారుడితో కలిసి బయటకు వచ్చేసి వేరుగా ఉంటోంది. ఆ కేసులో అప్పటికే అరెస్టయిన ఆమె తండ్రి ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్‌పై విడుదలయ్యాడు. తన కూతురిపై పగ పెంచుకుని తన  స్నేహితులకు అప్పగించడమే కాకుండా తానూ ఈ కిరాతకానికి పాల్పడ్డాడు.