బీజేపీ ఓటమిపై కేటీఆర్ వెటకారం, హెచ్చరిక! - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ ఓటమిపై కేటీఆర్ వెటకారం, హెచ్చరిక!

March 15, 2018

ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని సామెత. ఉత్తరప్రదేశ్, బిహార్ లలో జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంది. యూపీ సీఎం, డిప్యూటీ సీఎంల అడ్డాల్లో బీజేపీ ఘోరంగా ఓడడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యాఖ్యలు వస్తున్నాయి. ‘ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.. ఏదీ శాశ్వతం కాదు..’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెటకారం, హెచ్చరికలను జోడిస్తూ ట్వీట్ చేశారు. అక్కడ ప్రజలు ఓ సందేశాన్ని ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఖాళీ చేసిన పార్లమెంట్ సీట్లలో ఫలితాన్ని చూస్తే, ఏదీ శాశ్వతం కాదన్న విషయం తేటతెల్లమైంది. బీజేపీ ఢిల్లీ పీఠం ఎక్కడానికి ఊతమిచ్చిన రాష్ట్రమే ఇప్పుడు ఏదే శాశ్వతం కాదన స్పష్టమైన సందేశం ఇచ్చింది…’ కేటీఆర్ ట్వీట్ చేశారు.