అడ్డుపడిన రైతును 4 కి.మీ.. అధికారి కావరం.. - MicTv.in - Telugu News
mictv telugu

అడ్డుపడిన రైతును 4 కి.మీ.. అధికారి కావరం..

April 13, 2018

ఉత్తరప్రదేశ్‌లో రైతులకు ఓ ప్రభుత్వ అధికారి ఘోరంగా అవమానించాడు. నిరసన తెలుపుతున్న ఓ రైతు తన కారుకు అడ్డం పడగా.. నాలుగు కి.మీ. అలాగే ముందుకు లాక్కెళ్లాడు. ఈ నిర్వాకాన్ని ఏదో ఘనకార్యం అన్నట్టు వీడియో కూడా తీశాడు. రాంనగర్ బ్లాక్‌లో ఈ దారుణం జరిగింది.  

మరుగుదొడ్ల నిర్మాణానికి  ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం రైతులు బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి కార్యాలయానికి వెళ్లినప్పుడు గొడవ జరిగింది. రైతులు అధికారుల కరుణ కోసం చాలాసేపు వేచి చూశారు. సాయంత్రం 5 గంటల సమయంలో బీడీవో పంకజ్‌ కుమార్‌ గౌతమ్‌ కార్యాలయం బయటకు వచ్చాడు. తన కోసం కాసుకుని కూర్చున్న రైతుల వైపు కన్నెత్తి చూడకుండా వెళ్లబోయాడు.

రైతులు ఆయన వెనుకాలే వెళ్లారు. పంకజ్ కారు స్టార్ చేయగానే రైతు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కానీ పంకజ్ అదేం పట్టించుకోకుండా కారును ముందుకు పొనిచ్చాడు. కొందరు రైతులు కారుకు అడ్డుతప్పకోగా, ఒక యువరైతు మాత్రం అలానే అడ్డుపడి కారు బానెట్‌ను పట్టుకున్నాడు. కానీ పంకజ్ కారు ఆపకుండా అలానే నాలుగు కిలోమీటర్లు పోనిచ్చాడు. ఈ ఘటనను మొత్తం పంకజ్ ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ తర్వాత యువరైతు, పంకజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాడు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.