చెక్కతో బైక్.. యువకుడి ప్రతిభ ఆద్బుతం... - MicTv.in - Telugu News
mictv telugu

చెక్కతో బైక్.. యువకుడి ప్రతిభ ఆద్బుతం…

March 19, 2018

ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ ఉంటుంది. అందుకు నిదర్శనమే ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన రాజ్ శాంతా. అతను చెక్కతో ఓ ప్రత్యేకమైన బైక్‌ను తయారు చేశాడు. రాజ్ ఆ బైక్ కు ‘ఊడీ ప్యాషన్’ అని పేరు పెట్టాడు. దేశీయ మోడల్‌లో రూపొందించిన ఈ బైక్ రోడ్డు మీద కనపడగానే అందరూ  కళ్లప్పగించి చూస్తున్నారు.ఫీచర్లు…

దీనికి 180సీసీ ఇంజన్‌ను అమర్చాడు. ఇంజన్‌ను చల్లబరిచేందుకు రేడియేటర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. అలాగే స్పోర్ట్స్ బైక్‌లకు వినియోగించే రెడియల్ టైర్లను అమర్చాడు. ఈ బైక్ లీటర్ పెట్రోలుతో 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇద్దరు వ్యక్తులు కూర్చుని ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది. దీని తయారీకి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చయ్యిందని తెలిపాడు.