మానవత్వం మరచి మూత్రం తాగించారు.. - MicTv.in - Telugu News
mictv telugu

మానవత్వం మరచి మూత్రం తాగించారు..

March 6, 2018

మానవత్వం రోజూ రోజుకు మాయమైపోతోంది.  కొంచెం కూడా మానవత్వం, జాలి , దయ లేకుండా ప్రవర్తించారు. అమ్మాయితో అక్రమ సంబంధం ఉందన్న నెపంతో ఓ వ్యక్తితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని శహారన్‌పూర్‌లో జరిగింది.బాధితుడు మాట్లాడుతూ… ‘ నాకు ఓ అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని నెపం మోపారు. కానీ నాకు, ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదని  ఎంత మొత్తుకున్నప్పటికీ వినిపించుకోకుండా చితకబాదారు. అంతటితో ఆగకుండా నాతో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ అవమానాన్ని భరించలేకనే ఆత్మహత్యాయత్నం చేశాను. ఆ అమ్మాయి తరపు బంధువుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. పోలీసులు నాకు రక్షణ కల్పించాలి ’ అంటూ పోలీసుల ముందు తన ఆవేదనను చెప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.