యోగి సర్కార్‌కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు... - MicTv.in - Telugu News
mictv telugu

యోగి సర్కార్‌కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు…

November 23, 2017

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి  జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులను జారీ చేసింది. రాష్ట్రంలో  శాంతి భద్రతల పరిరక్షణ పేరిట ప్రభుత్వ ఆమోదంతో 6 నెలల కాలంలో 433 ఎన్‌కౌంటర్లును చేసింది. ఈ కాల్పుల్లో 19 మంది నేరస్థులు  మరణించగా, 89 మంది గాయపడ్డారు.శాంతి పరిరక్షణ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరస్థులను హతమార్చిందని వచ్చిన ఆరోపణలను సుమోటోగా తీసుకుని నోటీసులను జారీ చేసింది.  ఎన్‌కౌంటర్ల గురించి 6 వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం , ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి నోటీసులను పంపింది.