భార్యను వేలాడదీసి వీడియో తీశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

భార్యను వేలాడదీసి వీడియో తీశాడు..

April 17, 2018

ఓ కట్న పిశాచి అదనపు కట్నం కోసం  కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హింసించాడు. ఎవరు ఊహించిన విధంగా ఆమెపై అత్యంత కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. తాను చేసే దారుణాన్ని వీడియో తీసి ఆమె పుట్టింటికి పంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్ పూర్‌లో చోటు చేసుకుంది. తాను అడిగిన డబ్బు  ఇవ్వకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని ఓ భర్త ,ఓ భార్యను హెచ్చరించాడు. ఆమె పుట్టింటి నుంచి వెంటనే రూ. 50వేలు తీసుకురావాలని చెప్పాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో రెచ్చిపోయిన భర్త ఆమెను బెల్ట్‌తో విపరీతంగా కొట్టాడు. దాదాపు ఆమెను 3 నుంచి 4 గంటల వరకు చిత్ర హింసలకు గురి చేశాడు. దీంతో బాధితురాలు స్పృహ తప్పి పడిపోయినా ఆమె రెండు చేతులను చున్నితో కట్టి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశాడు. ఆ కట్న పిశాచి తను చేసే ఘనకార్యాన్ని వీడియో తీసి ,బాధితురాలి సోదరుడికి పంపాడు. తనకు డబ్బు తెచ్చి ఇస్తే సరి. లేకపోతే ఇంకా చిత్రహింసలు పెడతానని బెదించాడు.
దీంతో ఆమె సోదరుడు ఆ వీడియోను పోలీసులకు చూపించి, కేసు  పెట్టాడు. ఆమెను ఇంటికి వెళ్లి విడిపించాడు. దీనిపై బాధితురాలు మాట్లాడుతూ…‘నేను చదువుకోలేదు. అందుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నా జీవితం నాశనమైపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు స్పృహ వచ్చేసరికి సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడుతూ ఉన్నానని ఆమె తెలిపింది. దీంతో ఆమె భర్తతో పాటు అతని నలుగురు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం  పోలీసులు గాలింపు చేపట్టారు.