చాయ్ కోసం 69 లక్షలు  ఖర్చు పెట్టిన  సియం ! - MicTv.in - Telugu News
mictv telugu

చాయ్ కోసం 69 లక్షలు  ఖర్చు పెట్టిన  సియం !

February 6, 2018

రాజభోగాలు అనుభవించాలంటే  ఇప్పుడున్న ఒకే ఒక్క దారి  రాజకీయం.  ఎన్కట రాజులు కూడా అనుభవించని రాజభోగాలు  ఈరోజుల్లో రాజకీయ నాయకులు అనుభవిస్తారంటే అతిశయోక్తి కాదేమో. డబ్బు, అధికారం, పరపతి  అన్నీ కావాలనుకుంటే రాజకీయమనే ఒక్క పిట్టను కొడితే చాలు..మీముందుకు భోగాలు వాటంతటవే వచ్చి వాలతాయి.

ఇంతకీ విషయం ఏంటంటే  త్రివేంద్రసింగ్ రావత్  ఉత్తరాఖండ్ రాష్ట్రం  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పది నెలలు కూడా కాలేదు.  కానీ  ప్రభుత్వ అకౌంట్లో తనకోసం వచ్చిన  అతిథులకు ఇచ్చే  టీ, స్నాక్స్ కోసం  ఏకంగా  68 లక్షల 59 వేలు ఖర్చు పెట్టాడు. అంటే  నెలకు దాదాపు  ఏడు లక్షల రూపాయలు  అన్నమాట.  

ఇక  ఈ వార్త తెలిసిన  ప్రజలు  ఆ ముఖ్యమంత్రిపై మండిపడుతున్నారు.  ప్రజల సదుపాయాలకోసం   ఖర్చు పెట్టమంటే  నిధుల కొరత ఉందని  చెప్పే  రాజకీయ నాయకులు ఇలా వాళ్ల  విలాసాల కోసం మాత్రం  లక్షల, కోట్లు  ఖర్చు పెడతారు’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఒక్క పది నెలల్లోనే  ఇంత  ఖర్చు పెట్టాడంటే  ఇక పదవిలో ఉన్నంత కాలం  ఎన్ని కోట్లను  ఖర్చు పెట్టి   రికార్డుల్లో కెక్కుతాడో అని  గుస గుసలాడుకుంటున్నారు.