దునియాలోనే అతి చిన్న పెన్సిల్ ! - MicTv.in - Telugu News
mictv telugu

దునియాలోనే అతి చిన్న పెన్సిల్ !

February 23, 2018

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానికి చెందిన కళాకారుడు ప్రకాశ్ చంద్ర  ప్రపంచంలోనే అతి చిన్న పెన్నిల్ తయారు చేశాడు. దాంతో ఆయన సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.ఈ సూక్ష్మ పెన్సిల్ 5మిల్లీ మీటర్ల పొడవు,0.5 మిల్లీ మీటర్ల వెడల్పుతో పెన్సిల్‌ను తయారు చేశాడు.  ఒక చెక్కను అరగదీసి  దానికి ముక్కును అమర్చినట్లు ప్రకాశ్ చెప్పాడు. ఈ పెన్సిల్‌ను తయారు చేయడానికి తనకు నాలుగు రోజుల సమయం పట్టిందని తెలిపాడు.

గతంలోనూ ప్రకాశ్‌ 3×3×4 మిల్లీ మీటర్ల  హనుమాన్‌ చాలీసా, అతి చిన్న నూలు రాట్రం తయారు చేసి  గుర్తింపు పొందాడు.ఆయన కళను గుర్తించి అసిస్ట్‌ వరల్డ్‌ రికార్డ్స్‌‌లో ఈ పెన్సిల్‌కు చోటు కల్పించారు.