అయోధ్య బరిలో హిజ్రా - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య బరిలో హిజ్రా

October 30, 2017

ఉత్తరప్రదేశ్‌లో త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. సమాజ్ వాదీ పార్టీ వీటికి భారీస్థాయిలో సన్నాహాలు చేస్తోంది.

అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించింది. అయోధ్య మేయర్ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ గుల్షన్ బిందు పేరును ఖరారు చేసింది. తన గెలుపు తథ్యమని గుల్షన్ పేర్కొంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని మండిపడింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చే నెల 21,22, 29న జరగనున్నాయి. డిసెంబర్ 1న ఫలితాలు ప్రకటిస్తారు.