పోలీస్ యూనిఫాం లోగోలో  కృష్ణుడు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ యూనిఫాం లోగోలో  కృష్ణుడు

December 14, 2017

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యే ప్రభుత్వం  మధురను పుణ్యక్షేత్రంగా  అధికారికంగా గుర్తించింది. అక్కడి పోలీసుల యూనిఫాంలో కృష్ణుడి బొమ్మతో ఉన్న లోగోను చేర్చాలని నిర్ణయించింది. కృష్ణుడి లోగోతో  యూనిఫాంలో ఉన్నది టూరిజం  పోలీసులు అంటూ తెలిపింది.మత ప్రమేయం లేని రాజ్యంలో  పోలీసు యూనిఫాంలో కృష్ణ భగవానుడి లోగోను చేర్చడం పై విమర్శలు వెల్లువెత్తాయి.పోలీసు యూనిఫాంలో కృష్ణుడి లోగోను  పెట్టడానికి అనుమతి ఇస్తే లౌకిక రాజ్యమనే పదానికి అర్థమే ఉండదని మాజీ డీజీపీ బ్రిజ్ లాల్ అన్నారు. ఇలా మతపరమైన లోగోను పోలీసులకు పెట్టడం తగదని  సూచించారు. దానివల్ల మన లౌకిక రాజ్యాంగాన్ని కాలరాసినట్టు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి వివేక్ బన్సాల్ విమర్శంచారు.మధుర పోలీసులు పర్యాటక ఫ్రెండ్లీ  అని చాటిచెప్పేందుకే తాము  పోలీసు యూనిఫాంలో లోగోగా కృష్ణుడిని  చేర్చామని మధుర జిల్లా ఎస్పీ స్వప్నిల్ మంగైన్ చెప్పారు.