వాలుజడ ఫస్ట్ లుక్ అదిరింది ! - MicTv.in - Telugu News
mictv telugu

వాలుజడ ఫస్ట్ లుక్ అదిరింది !

August 29, 2017

రమణ మల్లం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సరికొత్త సినిమా ‘ వాలుజడ ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కాజల్ అగర్వాల్ విడుదల చేసారు. తెలుగు, తమిళ్ ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న సరికొత్త, వినూత్న సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కు బయట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ కబాలి ’ సినిమాలో రజినీకాంత్ కూతురిగా యాక్ట్ చేసిన సాయి ధన్సిక ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే శరణం గచ్ఛామి, జానకి రాముడు సనిమాల్లో హీరోగా చేసిన నవీన్ సంజయ్ హీరోగా నటిస్తున్నాడు. మరో కీలకమైన పాత్రల్లో నానా పటేకర్, రైతు బిడ్డ నితిన్ నటిస్తున్నారు. విజె గౌతమ్ కూడా ఇందులో నటిస్తున్నాడు. సింహవాహినీ నాగరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు రమణ మల్లం మాట్లాడుతూ ‘ ఈ సినిమా కథ యదార్థ సంఘటనలతో పన్నెండేళ్ళ క్రితం రాస్కున్నదని ’ చెప్పారు.

ఇక రమణ మల్లం గురించి చెప్పుకుంటే తను 1996 నుండే తన కెరియర్ ను ప్రారంభించారట. తొలుత ముంబయిలో ‘ etc ’మ్యూజిక్ ఛానల్ కు ఏపి స్పెషల్ కరెస్పాండెంటుగా పదేళ్ళు పని చేసారట. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దగ్గర ‘ ఎటో వెళ్ళిపోయింది మనసు ’ వరకు నాలుగేళ్ళు దర్శకత్వ శాఖలో పని చేసారు. అలాగే తమిళ దర్శకుడు, హీరో అయిన చేరన్ దగ్గర కూడా రెండున్నరేళ్ళు పని చేసారు. ఈ మధ్యే వచ్చిన ‘ మనం ’ సినిమాకు విక్రం కె కుమార్ దగ్గర కోడైరెక్టరుగా పని చేసారు. ఇంతటి అపారమున్న అనుభవమున్న దర్శకుడు సంధిస్తున్న తొలి బాణం ‘ వాలుజడ ’. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్టవుతుందని ఫస్ట్ లుక్ చూసినవారంతా అభిప్రాయ పడుతున్నారు. సెప్టెంబర్ లో మొదలయ్యే తదుపరి షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగును ఫినిష్ చేసి, విడుదల ప్లానింగ్ చేస్తారట. రాధన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ రామస్వామి కెమెరామెన్ గా, ప్రవీణ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో అంచనాలతో వస్తున్న వాలుజడ డైరెక్టర్ అండ్ టీంకు అభినందనలు చెబుదామా.