సైకిల్ ఎక్కిన  వాణీ విశ్వనాథ్..! - MicTv.in - Telugu News
mictv telugu

సైకిల్ ఎక్కిన  వాణీ విశ్వనాథ్..!

September 15, 2017

‘ ఘరానా మొగుడు ’ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా, అడవిలో అరుణక్క, కొదమ సింహం, అలెగ్జాండర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన వాణీ విశ్వనాథ్ గుర్తింది కదా. ఈమధ్య ‘ జయ జానకి నాయక ’ సినిమాలో కూడా సపోర్టింగ్ రోల్ లో కనిపించింది. తనిప్పుడు రాజకీయాల్లోకి కూడా రాబోతోంది. అది కూడా ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో చేరి. రీసెంటుగా తిరుమలను సందర్శించుకున్న ఆమె ఈ విషయాన్ని బాహటంగా వెల్లడించింది. ఈ విషయమై చంద్రబాబు నాయుడుతో చర్చలు కూడా జరిగినట్టు చెప్పింది. ఇప్పటికే నటి రోజా తెలుగుదేశం పార్టీ నుండి వైదొలిగి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ విషయం ప్రస్తావించినప్పుడు రోజా మంచి నటి, అంతకు మించి నాకు మంచి ఆప్తురాలని చెప్పుకొచ్చింది. మొత్తానికి హీరోయిన్ గా రిటైరైయ్యాక పెళ్ళి చేస్కొని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్టే పత్తా లేకుండా పోయింది వాణీ. చాలా కాలం తర్వాత ’జయ జానకి నాయక‘ సినిమాలో మెరిసింది. తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించి తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.