వర్మ.. శ్రీదేవి బయోపిక్ తీయడంట.. ఎందుకో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ.. శ్రీదేవి బయోపిక్ తీయడంట.. ఎందుకో తెలుసా?

March 3, 2018

శ్రీదేవిని అమితంగా ఇష్టపడే  రాంగోపాల్ వర్మ  ఆమె మీద వస్తోన్న బయోపిక్  వార్తలపై స్పందించాడు. ‘ తాను శ్రీదేవి బయోపిక్ తీయబోతున్నట్లు  కొన్ని మీడియాలు  వార్తల మీద వార్తలు రాస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై చర్చ జరుగుతోంది. అయితే  నేను శ్రీదేవి  బయోపిక్  తీయడం లేదు. ఆ ప్రయత్నం కూడా అవివేకం. ఎందుకంటే శ్రీదేవిలా  ఆ పాత్రను పోషించగల నటి ఒక్కరూ కూడా లేరు. అందుకే నేను ఆమె బయోపిక్ తీయడం లేదు.  వార్తా కథనాల్లో వచ్చే వన్నీ అవాస్తవం’ అని స్పష్టం చేశారు.

శ్రీదేవిని వర్మ ఎంతగా ఆరాధిస్తాడో  అందరికి తెలిసిన విషయమే.  ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని వర్మ  సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ తన భావోద్వేగాలు  అందరితో పంచుకున్నాడు. అంతేకాదు ఈ మధ్య శ్రీదేవి గురించి ఆయన రాసిన  ఓ లేఖ కూడా అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఆమె జీవితం గురించి ప్రేక్షకులకు తెలియని  ఎన్నో విషయాలను వర్మ ఆ లేఖలో రాసి భావోద్వేగానికి లోనయ్యాడు.