పవన్ కొడుకు పేరుపై వర్మ సెటైర్ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కొడుకు పేరుపై వర్మ సెటైర్

November 2, 2017

పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవాకు ఈమధ్యే కొడుకు పుట్టాడు. కొడుకుకు పవన్ ‘మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల’ అని పేరు పెట్టాడు. ఇందులో  తన  అన్న చిరంజీవి, రష్యన్ మత సాంప్రదాయం,తన పేరు అన్నీ కలిసి వచ్చేటట్టు పవన్, తన కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నాడు. అయితే ఈ పేరుపై రాంగోంపాల్ వర్మ  అందరకిీ అర్థంకాని భాషలో, తనదైన శైలిలో పోస్ట్ పెట్టాడు.

  ‘భాషల పుట్టుక తర్వాత తాను విన్న పేర్లలో అతి గొప్పది ఇదేనని, క్రైస్తవ మత ఆరంభానికి ముందు కాలం నాటి నుంచి, అసలు మనుషులు సంభాషించుకోగలరా? అని ఈజిప్టుకు చెందిన పారా సమెథికస్‌ I పరిశోధనలు చేసిన కాలం నుంచి వెతికినా ఇలాంటి పేరును తాను వినలేదని’ వర్మ వ్యంగ్యంగా  తన పోస్టులో రాసాడు.