రేవంత్ కాంగ్రెస్ మెగాస్టార్ : వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ కాంగ్రెస్ మెగాస్టార్ : వర్మ

November 1, 2017

మొన్న  రేవంత్‌ను  ‘కాంగ్రెస్ బాహుబలి’ అని  చెబుతూ  మార్ఫింగ్ చేసి ఓ ఫోటోను తన ఫేస్ బుక్‌లో పెట్టిన వర్మ, మళ్లీ ఈరోజు ఇంకో ఫోటో పెట్టాడు.  మెగాస్టార్ నటించిన ‘ఖైదీ నం.150’ సినిమాలోని  ఓపోస్టర్‌లో  రేవంత్ తలకాయను అతికించి, కింద  ‘రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్’ అని రాసుకొచ్చాడు.  ఈలెక్కన  సినిమాలు తీయడంకంటే   మార్ఫింగ్ చేయడంలోనే వర్మ  ఎక్కో బిజీ అయ్యాడని పలువురు అనుకుంటున్నారు.  రాహుల్ గాంధీ సమక్షంలో  నిన్ననే  రేవంత్  కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే.