ఆమె ఏ లోకంలో ఉన్నా ప్రేమిస్తూనే ఉంటా - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె ఏ లోకంలో ఉన్నా ప్రేమిస్తూనే ఉంటా

February 25, 2018

అతిలోక సుందరి మరణం అందరినీ శోకసంద్రంలో పడవేసింది. అయితే శ్రీదేవి తన ఆరాధ్య దేవతగా కొలిచిన వ్యక్తి రాంగోపాల్ వర్మ. శ్రీదేవి మరణ వార్త వినగానే వర్మ తన ట్విటర్ వేదికగా చాలా ఎమోషనల్ అయ్యాడు. దేవుణ్ణి ఎప్పుడు ఇంత‌లా నేను ద్వేషించ‌లేదు. కాంతికన్నా ఎక్కువ ప్రకాశవంతమైనది..ఈరోజు మనకు దూరమైంది,శ్రీదేవి ఏ లోకంలో ఉన్నా..ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా, ఆమె ఏ లోకంలో ఉన్నా దేవకన్యే’ అని వర్మ శ్రీదేవికి తన నివాళులు అర్పించాడు.‘

అంతేకాదు ’శ్రీదేవి నిజంగానే చనిపోయిందా? లేక ఎవరైనా నన్ను నిద్రలేపి ఇదొక పీడకల మాత్రమే అని చెప్పగలరా?‘అని ఆవేదన వ్యక్తం చేశాడు వర్మ. శ్రీదేవి భర్త బోనీ కపూర్ పరిస్థితి చూస్తే  నామనసులో చాలా ఆవేదనగా ఉంది అని బాధపడ్డాడు. శ్రీదేవితో వర్మ గోవిందా గోవిందా, క్షణం,క్షణం వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు మోమిత్ మార్వా పెళ్లికోసం భర్త బోనీకపూర్‌, చిన్న కుమార్తె ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో మరణించింది.