శ్రీదేవి గురించి ఇలా మాట్లాడుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి గురించి ఇలా మాట్లాడుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది !

February 26, 2018

దుబాయ్‌లో మృతి చెందిన శ్రీదేవి గురించి వర్మ  తన ఫేస్‌బుక్ పేజీలో, ట్విటర్లో చాలా ఎమోషనల్‌గా తన భావాలను అందరితో పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన మరో పోస్ట్ పెట్టాడు. ‘ఇంతకు ముందేమో పబ్లిక్.. శ్రీదేవి దేహ సౌందర్యం గురించి, ఆమె దేవతలాంటి ముఖం గురించి, ఆమె కళ్ల గురించి, సున్నితమైన లిప్స్ గురించి, ఆమె మెరుపు తొడల గురించి మాట్లాడుకునే వారు.

కానీ ఈరోజు మాత్రం ఆమె శరీరం లోపట భాగాల గురించి, రక్తంలో బయటపడ్డ ఆల్కాహాల్ గురించి, ఊపిరితిత్తులలో నిండిన  నీళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఎవరి జీవితం  కూడా ఇంత ట్రాజిడీగా, ఇంత భయంకరంగా  ముగియద్దు. ఇప్పుడు ఆమె గురించి ఇలా పలు రకాలుగా మాట్లాడడం వింటుంటే కూడా నాకు చాలా బాధేస్తోంది. వీళ్లందరూ ఇలా మాట్లాడుతుంటే  నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది’ అని వర్మ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.