పవన్‌కళ్యాణ్ నుంచి అది నేర్చుకున్నాను - MicTv.in - Telugu News
mictv telugu

పవన్‌కళ్యాణ్ నుంచి అది నేర్చుకున్నాను

December 15, 2017

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే  వర్మ.. మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘ పవన్ కల్యాణ్  తాజా ప్రసంగాన్ని  తాను ఇప్పడే చూశాను, భిన్న అంశాలపై ఆయనకున్న దూరదృష్టిని చూసి ఆశ్చర్యపోయాను..పవన్ కల్యాణ్‌కు నేను కృతఙ్ఞతలు చెప్పాలనుకుంటున్నా’ అని వర్మ తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

అంతేకాదు  ‘ గతం, భవిష్యత్ పై అతనికి ఉన్న స్పష్టత అమోఘం. అన్నింటి కంటే ముఖ్యంగా, వ్యక్తిగతంగా చెప్పాలంటే, మాట్లాడేముందు పవన్ ఆలోచిస్తాడు, ఈ పాఠాన్ని ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే, నాకొక స్టుపిడ్ హ్యాబిట్ ఉంది.. మాట్లాడేటప్పుడైనా, ట్వీట్ చేసేటప్పుడైనా ఎటువంటి ఆలోచనా చేయను. అందుకే అన్ని అంశాలకు సంబంధించి ఎంతో దూరదృష్టి ఉన్న పవన్ కల్యాణ్‌కు నేను కృతఙ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. గొప్ప నాయకుల్లో ఒకే ఒక వ్యక్తిగా పవన్ కల్యాణ్ నిలిచిపోతారని నేను భావిస్తున్నా’ అని వర్మ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

అయితే వర్మ పెట్టిన పోస్టుపై పలువురు ‘ఇంతకీ వర్మ నిజంగానే పవన్‌ను పొగిడాడా? లేదా తనదైన శైలిలో  వ్యంగ్యంగా  పోస్టు రాశాడా..బహుశా ఆయన చెప్పినట్టు ముందూ వెనకా ఏది ఆలోచించకుండా రాశాడా? ఏది అర్థంకావడంలేదంటూ  కామెంట్లు పెడుతున్నారు.