వర్మ వర్సెస్ సోమిరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ వర్సెస్ సోమిరెడ్డి

October 12, 2017

రాంగోపాల్ వర్మ దేని మీదైనా స్పందిస్తాడు. తననెవరైనా కెలికినా వూరుకోడు. చెంపపెట్టులాంటి రిప్లై ఇస్తాడు.  తాజాగా ఏపీ మంత్రి  సోమిరెడ్డికి ఇలాంటి సమాధానమే ఇచ్చారు. వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’పై చర్చకు తాను కాదు, తన నా పాలేరు కూడా రాడని సోమిరెడ్డి అన్నాడు. దీనికి వర్మ ఫేస్ బుక్‌లో కౌంటరిచ్చాడు. అదేమిటో చూడండి..

మినిస్టర్ సోమిరెడ్డి కామెంట్స్‌కి నా రిప్లైస్ :

మినిస్టర్ సోమిరెడ్డి : NTR పై వర్మ తో బహిరంగ చర్చకు నేనే కాదు నా పాలేరు కూడా వెళ్ళడు

RGV : మీరు మీ పాలేరు కూడా చర్చకి రాలేనప్పుడు అసలు నా మాటల మీద స్పందించవలిసిన అవసరమేమొచ్చింది సార్.. మీరు రావట్లేదంటే మీ కన్న NTR గారి గురించి నాకే ఎక్కువ తెలుసని మీరొప్పుకున్నట్టేగా.. థాంక్స్ సార్

మినిస్టర్ సోమిరెడ్డి : వర్మ తెలివితేటలు ఏదైనా ఉంటే లక్ష్మీస్ ఎన్ఠీఆర్ సినిమా సక్సెస్‌పై చూపమను

RGV : వావ్ ???ఏం జీనియస్ సార్ మీరు???..మీరు చెప్పేవరకు నాకు ఈ విషయం తట్టనే లేదు.

సోమి టీచర్ గారు, కనీవినీ ఎరుగని గొప్ప పాఠం చెప్పారు.. దయచేసి ఫీజు ఏ అడ్రెస్‌కి పంపాలో చెప్పండి ?

అంటూ చాలా వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. మరి దీనిమీద సోమిరెడ్డి ఎలా స్పందిస్తాడోనని చూస్తున్నారు వర్మ అభిమానులు.