వరుణ్‌ ధావన్‌ను క్లాస్ పీకిన ట్రాఫిక్ పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

వరుణ్‌ ధావన్‌ను క్లాస్ పీకిన ట్రాఫిక్ పోలీసులు

November 23, 2017

అభిమానులు సరదాగా సెల్ఫీ కోరితే కాదనటం హీరోల నైజం కాదనుకున్నట్టున్నాడు బాలీవుడ్ యంగెస్ట్ హీరో వరుణ్ ధావన్. కాకపోతే చుట్టూ పరిస్థితులను గమనించి వుండాల్సింది. ముంబయి రోడ్డులో ఫుల్ ట్రాఫిక్ జామై వుంది. ఆ ట్రాఫిక్‌లో వరుణ్ ధావన్ కారు పక్కనే వున్న ఆటోలోంచి ఒక అమ్మాయి వరుణ్‌ని ముచ్చటగా ఓ సెల్ఫీ అడిగింది. వెంటనే వరుణ్ కాదనలేక ఎస్ అన్నాడు. కారు విండోలోంచి అతను బయటకు తొంగి చూస్తుంటే.. అమ్మాయి ఆటోలోంచి వంగి సెల్ఫీ తీసుకున్నారు. తమ వెనాకా ముందు అంత రద్దీగా ట్రాఫిక్ వుండగా వీళ్ళిలా సెల్ఫీ తీసుకోవడంతో చాలా మంది ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారట. ఇదంతా ట్రాఫిక్ పోలీసులు గమనించారు. తమ చేతిలో వున్న కెమెరాకు పని చెప్పారు. వెంటనే వారి సెల్ఫీ భాగోతాన్ని ఫోటో తీశారు.‘ ఇలాంటి సీన్లు సినిమాల్లో చేసుకోండి.. నిజ జీవితంలో మీలాంటివాళ్లు యూత్‌కు ఆదర్శంగా ఉండాలి.. మీరిలా చేయటం కరెక్ట్ కాదు.. ప్రస్తుతానికైతే ఈ-చలాన్ మీ ఇంటికి వస్తున్నది.. ఇంకెప్పుడైనా ఇలాగే దొరికితే బాగుండదు ’ అంటూ వరుణ్‌కు క్లాస్ పీకారు. ఆ ఫోటోను ఈ-చలాన్ సైట్‌లో పెట్టారు. అంతటితో ఊరుకోకుండా ట్విట్టర్‌లో ఫొటో పోస్ట్ చేసి అతనికి వార్నింగ్ ఇచ్చారు.