ప్రభాస్, నితిన్‌ల పెళ్లి తర్వాతే నా పెళ్లి.. వరుణ్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్, నితిన్‌ల పెళ్లి తర్వాతే నా పెళ్లి.. వరుణ్

February 16, 2018

కుర్ర హీరో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమా విజయం కావడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. కెరీర్‌పై మరెన్నో ఆశలు పెట్టుకున్నాడు. పెళ్లిని కూడా వాయిదా వేసేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వూలో మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగ్గా.. ఆసక్తికర సమాధానం  చెప్పాడు.  

తనకంటే సీనియర్ నటులైన ప్రభాస్, నితిన్‌‌లు వివాహం అయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ప్రేమ ,పెళ్లి గురించి ఆలోచించే సమయం లేదని, తనకు సినిమాలతోనే ప్రస్తుతం పెళ్లి  అయిందని చెప్పాడు. వరుణ్ తర్వాతి చిత్రాన్ని అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఘాజి’ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి  దర్శకత్వం వహిస్తున్నాడు.