ఇండియా వచ్చిన వీర్‌దీప్ జంట… అభిమానుల సెల్ఫీలు…

బాలీవుడ్ బ్యూటిఫుల్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకొనెలు(వీర్‌దీప్) ఐదేళ్ల వరకు ఘాటుగా ప్రేమించుకున్నారు. ఈనెల 14,15 తెేదీల్లో ఇటలీలో కొంకణి సంప్రదాయంలో వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయ్యాక ఈ ఉదయం ఇండియాకు వచ్చారు ఇద్దరు. ముంబై విమానాశ్రయంలో దిగి అభిమానులకు కనువిందు చేశారు ఈ జంట. అభిమానులు వారిని చూడటానికి పోటీలు పడ్డారు. చాలామందితో సెల్ఫీలు దిగారు. ఎయిర్ పోర్ట్ సిబ్బందితో కూడా సెల్ఫీలు దిగారు.

Telugu news Veerdeep couple who came to India ... fans' selfies ….

ఎయిర్ పోర్టులో దిగిన వీరు నేరుగా రణ్‌వీర్ నివాసానికి వెళ్లగా, వీరికి సంప్రదాయ రీతిలో బంధుమిత్రులు స్వాగతం పలికారు. ఈనెల 28న ముంభైలో విందు ఇవ్వడానికి ఈ జంట ఏర్పాట్లు చేస్తోంది. ఈ విందులో బాలీవుడ్ హేమాహేమీలందరూ పాల్గొననున్నారు.

Telugu news Veerdeep couple who came to India … fans’ selfies …