వ్యాపారం అందరూ చెయ్యాలనుకుంటారు. కానీ అందులో ఉన్న కిటుకులు తెలియక చాలామంది బొక్కబోర్లా పడుతుంటారు. ముఖ్యంగా వ్యాపారానికి కావలసింది ఆకట్టుకకునే పబ్లిసిటీ. అమ్మాల్సిన సరుకు ఎంత నాణ్యంగా ఉన్నా, ఎంత తక్కువ ధరలో అమ్ముతున్నా వ్యాపారానికి కావలసిన పబ్లిసిటీ లేకపోతే గిరాకీలు లేక దుకాణంలో ఈగలు జోపుకోవాల్సిందే. కరీంనగర్ జిల్లా ప్రకాశంగంజ్కు చెందిన కొబ్బరికాయలు అమ్మే దేవుసాని పాపయ్య వ్యాపారంలోఉన్న అసలు కిటుకును ఒడిసిపట్టి వెరైటీ పబ్లిసిటీ మొదలు పెట్టాడు.అదేంటంటే ‘మా దుకాణంలోని కొబ్బరికాయలు దేవునికి సమర్పించినచో మంచి జ్ఞానం, ధైర్యం, ధనము, బలము, ఆరోగ్యం, తేజస్సు మరియు మంచి సహనము మీకు లభించును’ అని గోడ పబ్లిసిటీతో మరీ కొబ్బరికాయలు అమ్ముతున్నాడు. ఈబ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్గా మారింది. కొంపదీసి దేవుసాని పాపయ్య దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండి అగ్రిమెంట్ ఏమన్నా కుదుర్చుకున్నాడా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.