పెళ్లి చేసుకుంటూనే ..రిపోర్టింగ్ చేసిన జర్నలిస్ట్ ! - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి చేసుకుంటూనే ..రిపోర్టింగ్ చేసిన జర్నలిస్ట్ !

February 5, 2018

అతడి వృత్తి  జర్నలిస్ట్. ఓ టీవీ చానళ్లో రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. కానీ ఆరోజు అతని పెళ్లి  అయినా కూడా మైక్ పట్టుకుని  పెళ్లిమండపంలోనే బ్రేకింగ్ న్యూస్ అంటూ రిపోర్టింగ్ మొదలు పెట్టాడు ఎందుకు? పాకిస్థాన్ జర్నలిస్ట్ హనాన్ బుకారీ అనే వ్యక్తి  తన పెళ్లి మండపాన్నే బ్రేకింగ్ న్యూస్ స్పాట్ గా మార్చేశాడు. తనకు కాబోయే భార్యను, అత్తమామలను, తల్లిదండ్రులను  పెళ్లి బట్టల్లో మైక్ పట్టుకుని రిపోర్టింగ్ చేశాడు. తన పెళ్లినే ఓ పెద్ద వార్తలాగ ప్రపంచానికి చూపెట్టిన ఈజర్నలిస్ట్  రిపోర్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే  పెళ్లి రోజు కూడా పాపం మైక్ పట్టుకున్నాడు అని కొందరు అతనిని మెచ్చుకుంటుంటే ఇంకొందరు మాత్రం ఇదేం జర్నలిజం…కుటుంబ విషయాలను కూడా బ్రేకింగ్ వార్తలాగా కవర్‌ చేయాలా అని మండిపడుతున్నారు.